80 లక్షల మంది ఖాతాల్లో కేంద్రం డబ్బులు వేసింది.. మీకు వచ్చాయో చెక్ చేసుకోండి
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే రూ.5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ చేయకుంటే వెంటనే చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటనలు చేయడం జరిగింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చివరి దశకు వచ్చింది.
Income Tax Return: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే రూ.5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ చేయకుంటే వెంటనే చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటనలు చేయడం జరిగింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చివరి దశకు వచ్చింది.
ఇప్పటి వరకు 4 కోట్ల మందికి పైగా ఈ పక్రియను పూర్తి చేసినట్లుగా ఆదాయపన్ను శాఖ చైర్మన్ నితిన్ గుప్తా వెళ్లడించారు. 4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేయగా మరికొంత మంది రాబోయే అయిదు రోజుల్లో భారీ ఎత్తున ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ అధికారులు పేర్కొన్నారు.
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన 4 కోట్ల మందిలో 80 లక్షల మందికి పన్ను రిఫండ్ అందించినట్లుగా నితిన్ గుప్తా పేర్కొన్నారు. 80 లక్షల మందికి పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో వారి రిఫండ్ జమ చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.
Also Read: Telangana, AP Rains News Live Updates: తెలంగాణ, ఏపీలో ఈ మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఇప్పటికే ఆ మొత్తంను చెల్లించాల్సి ఉన్నా కూడా సిబ్బంది కొరత కారణంగా ఆలస్యం అయిందని ఆయన పేర్కొన్నారు. ఐటీ శాఖలో సిబ్బంది కు సంబంధించిన విషయాన్ని ప్రస్తుతం మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకు వెళ్లబోతున్నట్లుగా పేర్కొన్నారు. సిబ్బంది నియామకంకు త్వరగా అనుమతించాలని కూడా నితిన్ గుప్తా విజ్ఞప్తి చేశారు.
2022 - 2023 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.16 లక్షల 51 వేల కోట్లు వసూళ్లు నమోదు అయినట్లుగా ఆయన తెలియజేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి 17.67 శాతం అధికం. ఈసారి సరైన సమయంలో రిటర్న్ లు దాఖలు చేసిన వారికి ప్రాసెసి చేసి రిఫండ్ అందిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 16 రోజుల్లోనే ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ చేయడం జరిగింది.
గతంలో చాలా రోజుల పాటు ఈ రిటర్న్స్ ప్రాసెస్ కి సమయం పట్టేది. జులై 24వ తేదీని ఇన్ కమ్ ట్యాక్స్ డే గా కేంద్రం నిర్వహిస్తోంది. ఆదాయపు పన్ను 164వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలో సాధిస్తున్న ప్రగతిని నితిన్ గుప్తా వెళ్లడించారు.
Also Read: AP Rains Alert: రేపటికి వాయుగుండం, వచ్చే ఐదు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి